Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ అభ్యంతరం 

RCB franchise files petition against Rajinikanth starred Jailer
Advertisement
  • ఇటీవల విడుదలైన జైలర్
  • రజనీకాంత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్
  • ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీతో కనిపించిన కాంట్రాక్ట్ కిల్లర్
  • హీరో కోడలిపై అసభ్య వ్యాఖ్యలు... హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
Advertisement
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. కొన్నేళ్లుగా హిట్లు కరవైన రజనీకాంత్ ను మళ్లీ హిట్ బాట పట్టించిన చిత్రం జైలర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. 

అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడలిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం... జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.
Advertisement
Advertisement
Jailer
RCB
Jersey
Rajinikanth
Delhi High Court
IPL
India

More Telugu News